: ప్రపంచంలోనే అందమైన మహిళగా ఎంపికైన వార్త వినగానే ఆశ్చర్యానికి గురయ్యా
పీపుల్ మ్యాగజీన్ తనను ప్రపంచంలోనే అందమైన మహిళగా ఎంపిక చేసిన వార్త వినగానే ఆశ్చర్యానికి గురయ్యానని 47 ఏళ్ల హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ పేర్కొంది. పీపుల్ మ్యాగజీన్ రెండోసారి తనను ప్రపంచ అందగత్తెగా ఎంపిక చేసినందుకు ఆమె ఎంతగానో సంతోషపడిపోయింది. ప్రతి ఏడాది పీపుల్ మ్యాగజీన్ ప్రపంచంలోని ప్రముఖ మహిళల్లో అందరిలోకెల్లా అందమైన వారిని ఎంపిక చేస్తుంది. తాజాగా ఈ మ్యాగజీన్ చేసిన ప్రకటనలో జెన్నిఫర్‌కు ఆ అదృష్టం దక్కింది. 2004లోనూ జెన్నిఫర్ ప్రపంచ అందగత్తెగా నిలిచారు. టెలివిజన్ నటిగా కెరీయర్‌ను ప్రారంభించిన ఆమె అనంతరం చలనచిత్ర నటిగా అద్భుత విజయాలను సాధించారు. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీసు వద్ద ఆమె అతిపెద్ద విజయం 2003లోని బ్రూస్ ఆల్మైటీ. జెన్నిఫర్ అనిస్టన్ నటుడు జాన్ ఆనిస్టన్, నటి నాన్సీ డౌల దంపతులకు కాలిఫోర్నియాలోని షేర్మన్ ఓక్స్ లో జన్మించారు. న్యూయార్క్ నగరంలో పెరిగారు.