: మహమ్మద్ అబ్దుల్ సమాద్ గా మారిన యూపీ శివసేన నేత సుశీల్ కుమార్ జైన్
దేశవ్యాప్తంగా హిందువులను బలవంతంగా ముస్లింలుగా మార్చారని ఆరోపిస్తూ, వీహెచ్పీ, శివసేనలు 'ఘర్ వాపసీ' పేరిట వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేళ, శివసేన నేత ఒకరు ముస్లిం మతం స్వీకరించి వార్తల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సుశీల్ కుమార్ జైన్ ముస్లిం మతం స్వీకరించి మహమ్మద్ అబ్దుల్ సమాద్ గా పేరును మార్చుకున్నాడని 'అమర్ ఉజాలా' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. జైన మతం వ్యవహారాలు నచ్చకపోవడం, మహారాష్ట్ర రెవెన్యూ విభాగం పనితీరు అసంతప్తిగా ఉండటం, మునిసిపల్ కార్పొరేషన్ పద్ధతులు బాగాలేవని ఆరోపిస్తూ, ఆయన మతం మార్చుకున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 15వ తేదీన ఎవరి బలవంతం లేకుండానే ఆయన మతం మారారని, ఈ వార్త మంగళవారం నాడు మహావీర్ జయంతి సందర్భంగా బయటకు రాగా, ముజఫర్ నగర్ జిల్లా ఖతౌలీ పట్టణంలో సంచలనమైంది.