: నల్లధనంపై అమితాబ్ అబద్ధాలు... సాక్ష్యాలు ఇవిగో!


ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'పనామా పేపర్స్'లో అమితాబ్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఆయన డబ్బులను కూడబెట్టారని, పలు కంపెనీల్లో డైరెక్టరుగా ఉండి, ఇండియాలో పన్ను చెల్లింకుండా డబ్బును దేశం దాటించారని ఆయనపై ఆరోపణలు రాగా, వాటిని స్వయంగా అమితాబ్ ఖండించారు కూడా. తన పేరును తప్పుగా వాడారని, సీబుల్క్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్, లేడీ షిప్పింగ్ లిమిటెడ్, ట్రెజర్ షిప్పింగ్ లిమిటెడ్, ట్రాంప్ షిప్పింగ్ లిమిటెడ్ కంపెనీల్లో తాను ఎన్నడూ డైరెక్టర్ గా పనిచేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ విషయం తప్పని, ఆయన అబద్ధాలు చెబుతుండవచ్చని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆయన మాటలు అబద్ధాలని చెప్పడానికి తాము సాక్ష్యాలను సంపాదించామని వెల్లడించింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నట్టు వెల్లడించింది. విదేశీ సంస్థల బోర్డు సమావేశాల్లో అమితాబ్ బచ్చన్ టెలిఫోన్ కాన్ఫరెన్స్ విధానంలో పాల్గొన్నారని పేర్కొంది. డైరెక్టర్లు, ఆఫీస్ బేరర్ల జాబితాలో ఆయన పేరు రికార్డై ఉందని, బహమాస్ లోని ట్రాంప్ షిప్పింగ్ కంపెనీ, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ లోని సీ బుల్క్ షిప్పింగ్ కంపెనీలో డైరెక్టరుగా ఉంటూ, 1994 డిసెంబర్ 12న జరిగిన బోర్డు సమావేశాల్లో ఆయన పాల్గొన్నారని వెల్లడించింది. కాగా, అమితాబ్ తో పాటు ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ కూడా విదేశాల్లో డబ్బు దాచినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాజా ఆరోపణలపై అమితాబ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News