: తమిళ రాజకీయం... విజయ్ కాంత్ కార్యాలయంపై రాళ్ల దాడి


తమిళనాట రాజకీయ వాతావరణం వాడివేడి విమర్శల నుంచి పరస్పర దాడుల దిశగా సాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ, నేతలు తమ నోళ్లకు పనిచెబుతుండగా, కార్యకర్తలు తమ చేతులకు పనిచెబుతున్నారు. చెన్నై, కోయంబేడులో విజయ్ కాంత్ ఆధ్వర్యంలోని డీఎండీకే పార్టీ కార్యాలయంపై కొద్దిసేపటి క్రితం రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, కొంత ఫర్నీచర్ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. తమ ఆఫీసుపై కొందరు ఆందోళనకారులు దాడికి దిగారని డీఎండీకే కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విజయ్ కాంత్ స్పందించాల్సి వుంది.

  • Loading...

More Telugu News