: పరిటాల ఇలాకాలో సామూహిక వివాహాల సందడి!... హాజరుకానున్న చంద్రబాబు


దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర సొంతూరు అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో సామూహిక వివాహాల సందడి నెలకొంది. పరిటాల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు గ్రామానికి సమీపంలోని తిరుమల దేవరగుడి వద్ద 300 జంటలు ఒక్కటి కానున్నాయి. కరవు జిల్లా అనంతపురంలో వివాహాలు కూడా చేసుకోలేని పేద కుటుంబాలకు చెందిన వారి వివాహాలను సొంత ఖర్చులతో నిర్వహించే బృహత్కార్యానికి తాను బతికుండగానే రవీంద్ర శ్రీకారం చుట్టారు. రవీంద్ర గతించిన తర్వాత ఆయన ఆశయాన్ని ఆయన సతీమణి, ఏపీ మంత్రి పరిటాల సునీత పర్యవేక్షణలో కొడుకు పరిటాల శ్రీరామ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి. నేడు అనంతపురం జిల్లా పర్యటనకు వెళుతున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News