: యాదాద్రి ప్రధాన ఆలయం మూత!... మరికాసేపట్లో బాలాలయం ఓపెన్!


తెలంగాణ తిరుమలగా వినుతికెక్కిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి ప్రధాన ఆలయం నిన్న మూత పడింది. యాదాద్రి అభివృద్ధికి తెరతీసిన తెలంగాణ సర్కారు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ను సంసిద్ధం చేసింది. ఈ క్రమంలో త్వరలోనే పనులు ఊపందుకోనున్నాయి. అభివృద్ది పనుల నిర్వహణ కోసం యాదాద్రి ప్రధాన ఆలయాన్ని నిన్న మూసివేశారు. అయితే భక్తులకు లక్ష్మీనరసింహుడి దర్శనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రూపుదిద్దుకున్న బాలాలయం... త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గుట్టపై అభివృద్ది పనులు ముగిసేదాకా యాదగిరీశుడిని భక్తులు బాలాలయంలోనే దర్శించుకోవాల్సి ఉంది. యాదాద్రి ప్రధాన ఆలయాన్ని మూసివేస్తున్న నేపథ్యంలో నిన్న భక్తులు ఆలయానికి పోటెత్తారు.

  • Loading...

More Telugu News