: మా నాన్న 16 ఏళ్ల యువకుడే!... తండ్రిపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 67 ఏళ్ల వయసు వచ్చిన తన తండ్రి 16 ఏళ్ల యువకుడేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా నిన్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పార్టీ నేతలు మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన సందర్భంగా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 67 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు 16 ఏళ్ల నవ యువకుడిలా పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని లోకేశ్ అన్నారు. విభజన అనంతరం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా... రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ వైపు సమస్యలను పరిష్కరించుకుంటూనే... మరోవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News