: 24న చీపురుపల్లికి వెళ్లనున్న బాలకృష్ణ
ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లా చీపురుపల్లి కి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ వెళ్లనున్నారు. ఆరోజు జరగనున్న రెండు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తనయుడు బాలకృష్ణ ఆవిష్కరించనున్నారు. అదే రోజున బాలకృష్ణ చిత్రం ‘డిక్టేటర్’ శత దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కూడా బాలకృష్ణ పాల్గొననున్నారు.