: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్...బెంగళూరుది పాత కథే


ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది. గేల్ లేకపోవడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా వచ్చాడు. గత మ్యాచుల్లో లాగే బెంగళూరు జట్టు ఆదిలోనే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. మెక్ క్లెంగన్ ధాటిగా ఆడుతున్న కేఎల్ రాహుల్ (23) ను పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో ఓపెనర్ కోహ్లీ (18) కి డివిలియర్స్ (7) జత కలిశాడు. బ్యాటింగ్ కు స్వర్గధామంగా పేర్కొనే వాంఖడే స్టేడియంలో వీరిద్దరూ వీర విహారం చేసే అవకాశం ఉందని కామెంటేటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు జట్టు ఒక వికెట్ కోల్పోయి 49 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News