: పాయింట్ బ్లాంక్ రేంజ్ లో వైద్యుడ్ని కాల్చేశారు


భారత్ లోని ఉత్తరాదిలో తుపాకుల దుర్వినియోగం పెరిగిపోతోంది. ఢిల్లీలో తనను దూషించారని కార్లో వెళ్తున్న వారిని వెంబడించి మరీ కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇంకా తేలకముందే...ఉత్తరాఖండ్ లో ఓ వైద్యుడ్ని గుర్తుతెలియని దుండగులు అందరూ చూస్తుండగా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చివెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే...గయ జిల్లాలోని జోష్ పూర్ ఆసుపత్రిలో శిశు వైద్యుడిగా విధులు నిర్వర్తించే సునీల్ కుమార్ సింగ్ ఈ ఉదయం ఆసుపత్రికి వచ్చారు. విధుల్లో భాగంగా పిల్లలను పరీక్షిస్తుండగా, సాయుధులైన దుండగులు వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. వైద్యుడు అక్కడికక్కడే కుప్పకూలారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News