: చర్యకు ప్రతిచర్య ఉన్నట్టే... సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిచర్య ఉంటుంది: అలియా భట్
న్యూటన్ సూత్రం చర్యకు ప్రతిచర్య అయితే, సోషల్ మీడియాలో మాత్రం అది తీవ్ర ప్రతిచర్య అవుతోందని అలియా భట్ పేర్కొంది. షాహిద్ కపూర్, అలియా భట్ జంటగా కరీనా కపూర్ ఓ ప్రత్యేకపాత్రలో నటిస్తున్న సినిమా 'ఉడ్తాపంజాబ్'. ఇందులో డ్రగ్ మాఫియా తీరుతెన్నులను చర్చించారు. బీహారీ వలస మహిళ పాత్రలో అలియా వినూత్నంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అలియా పాత్రపై ఓ బీహార్ కు చెందిన యువతి సోషల్ మీడియాలో బహిరంగ లేఖ రాసింది. బీహార్ అంటే దుర్భర దారిద్ర్యానికి, నేరమయ జీవితానికి ప్రతీక అని పాతచింతకాయ పచ్చడి ఆలోచనల నుంచి బయటకు రారా? అంటూ ఆ బహిరంగ లేఖలో నిప్పులు చెరిగింది. దీంతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి ఆమె లేఖపై చర్చించారు. దీంతో తాజాగా అలియా భట్ స్పందించింది. సాధారణంగా చర్యకు ప్రతిచర్య ఉంటుందని...అదే సోషల్ మీడియాలో అయితే అది తీవ్ర ప్రతిచర్య అవుతుందని ఆమె వ్యాఖ్యానించింది.