: నిజ జీవితంలో కూడా రూపా గంగూలి ద్రౌపదే.. ఆమె తాగే సిగిరెట్ పొడవెంతో నాకు తెలుసు: ‘తృణమూల్’ సీనియర్ నేత
‘మహాభారత్’ సీరియల్ లో ద్రౌపది పాత్ర పోషించి రూపా గంగూలీ నిజ జీవితంలో కూడా ద్రౌపదేనని, ఆమె తాగే సిగిరెట్ ఎంత పొడవుంటుందో తనకు తెలుసంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సీనియర్ నేత రజాక్ మొల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ లో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తమ సొంత పార్టీ నేతలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలనాటి అందాల తార మున్ మున్ సేన్ ను రాజ్యసభకు పంపాలని అధినేత్రి మమతా బెనర్జీ చూస్తున్నారని, సెలబ్రిటీలు ఎంపీలుగా పనికిరారని అన్నారు. మున్ మున్ సేన్ ను రాజ్యసభకు పంపవద్దని మమతా బెనర్జీని కోరుతున్నానని అన్నారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా (నార్త్) నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆమె పోటీ చేస్తోంది. టీఎంసీ నుంచి ప్రముఖ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.