: నా ఫిట్‌నెస్‌కి ఆయనే కారణం: సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆటతీరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. సచిన్ తర్వాత అంతటి గొప్ప బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లే అంటూ పలువురు విశ్లేషకులు ఆయన్ను పొగిడేస్తున్నారు. విరాట్ క్రీజులో ఉన్నాడంటే టీమిండియా అభిమానులకు పండగే. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కోహ్లీ తన ఆటతీరు మెరుగ్గా ఉండేలా చేస్తోన్న తన ఫిట్‌నెస్‌కి కారణాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పేశాడు. తాను ఫిట్‌గా ఉండడానికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫిట్‌నెస్ కోచ్ శంకర్ బసూనే అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. తాను చక్కని ఆటతీరును కొనసాగించడానికి ఫిట్‌నెస్‌లో తనకు కోచింగ్ ఇస్తోన్న శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.