: ముంబయి-అహ్మదాబాద్ మధ్య త్వరలో అండర్ వాటర్ బులెట్ ట్రెయిన్


దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ బుల్లెట్ ట్రెయిన్ ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడవనుంది. పొడవైన ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ లో సముద్ర గర్భంలో సొరంగమార్గం ఏర్పాటు చేయనున్నారు. సుమారు 21 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం ద్వారా ఈ బుల్లెట్ రైలు ప్రయాణిస్తుందని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రైల్వే మంత్రిత్వ శాఖాధికారులు వెల్లడించారు. అరేబియన్ సముద్ర తీర రేఖ పొడవున, థానేక్రీక్ వెంబడి సముద్రంలో ఏర్పాటు చేయనున్న ఈ టన్నెల్ ఏర్పాటుకు అంచనా ఖర్చు సుమారు రూ.97,636 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అధిక శాతం ఫండింగ్ జపాన్ నుంచి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News