: అవి మామూలు కప్పలు కాదు... పార్శిల్ ద్వారా వచ్చిన కప్పలు విషసర్పాల వంటివి!
పోలండ్ నుంచి ప్లాస్టిక్ కంటైనర్లలో ఉన్న విషపు కప్పల పార్సిల్ ను చైనా అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎవరికీ అనుమానం రాకుండా గిఫ్ట్ ప్యాక్‌లా రూపొందించి దేశాలు దాటించిన ఆ కప్పల పార్సిల్ ను గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే 'వామ్మో' అంటూ గుండెలమీద చెయ్యి వేసుకోవాల్సింది. ఈ కప్పల్లో అత్యంత విషపూరితమైన 'గోల్డెన్ డార్ట్ కప్ప' ఉంది. ఈ కప్ప ద్వారా సేకరించే ఒక గ్రాము విషంతో 15 వేల మందిని అవలీలగా చంపేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కప్పలను సేకరించాలంటే ప్రాణాలకు తెగించాలని వారు పేర్కొంటున్నారు. ఇంత ప్రమాదకరమైన కప్పలను సేకరించి దేశాలు దాటించారంటే దీని వెనుక ఎంత మొత్తం చేతులు మారి ఉంటుందోనని వారు ఆలోచనలో మునిగిపోయారు. కాగా, నాగుపాము విషాన్ని డ్రగ్స్ లో వాడే విధంగా దీనిని కూడా డ్రగ్స్ లో వాడుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.