: ఏయూ డిగ్రీ సెకెండ్ ఇయర్ పేపర్ లీక్...పరీక్ష రద్దు


ఆంధ్రాయూనివర్సిటీ నిర్వహిస్తున్న డిగ్రీ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ నర్సీపట్టణం మండలం బలిఘట్టంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లీక్ అయిందని వార్తలు వచ్చాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన యూనివర్సిటీ అధికారులు విచారణ చేసి, పేపర్ లీక్ నిజమేనని నిర్ధారించారు. ఈ మేరకు ఏయూ రిజిస్ట్రార్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పదించిన రిజిస్ట్రార్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని వదిలే ప్రసక్తిలేదని ఆయన అన్నారు. పేపర్ లీకేజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. తదుపరి పరీక్షను నిర్వహించేది ఎప్పుడో ప్రకటిస్తామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News