: చిన్నారులకు వాతలు పెట్టిన ఐసీడీఎస్ ఆయాలపై వేటు


కరీంనగర్ లోని ఐసీడీఎస్ శిశుగృహంలో చిన్నారులకు వాతలు పెట్టిన ఐసీడీఎస్ కు చెందిన ముగ్గురు కాంట్రాక్టు ఆయాలపై వేటు పడింది. సర్వీసు నుంచి వారిని తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సంఘటన నిన్న వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ శిశుగృహాన్ని సందర్శించారు. బాధిత చిన్నారులను పరామర్శించి వారితో మాట్లాడారు. సంఘటన నేపథ్యంలో ఐసీడీఎస్ పీడీ మోహన్ రెడ్డిపై కలెక్టర్ మండిపడ్డారు. కాగా, ఈ నెల 15వ తేదీన కరీంనగర్ లోని శిశు గృహంలో ఆయాలు బుచ్చమ్మ, శారద, పద్మలు విధులు నిర్వహిస్తున్నారు. శిశు గృహంలోని చిన్నారులకు స్పూన్ తో కాల్చి వాతలు పెట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News