: మోదీ హయాంలో రికార్డు స్థాయికి అవినీతి, 'హిందుత్వ' దుర్మార్గాలపై మెతగ్గా విచారణ: అమెరికా


ఇండియాలో హిందుత్వ సంస్థల హస్తమున్న మాలెగావ్ పేలుళ్లు వంటి కేసులో విచారణపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ వంటి సంస్థలు మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. భారత్ లో అవినీతి, లంచగొండితనం రికార్డు స్థాయికి పెరిగిందని, ఎన్ కౌంటర్లు భారీగా జరుగుతున్నాయని అమెరికా ప్రభుత్వ మానవ హక్కుల విభాగం (యూహెచ్ఆర్డీ) 2015 నివేదిక సంచలన వ్యాఖ్యలు చేసింది. మావోయిస్టులు తమ సాయుధ విభాగాల్లో చిన్నారులను చేర్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసిన యూహెచ్ఆర్డీ, కొన్ని దళాల్లో 12 ఏళ్ల పిల్లలు ఆయుధాలతో తిరుగుతున్నారని పేర్కొంది. భద్రతా బలగాల నుంచి రక్షణకు వారిని అడ్డు పెట్టుకోవడం ఆందోళనకరమని అభిప్రాయపడింది. వివిధ నిరసనల పేరు చెప్పి ఇంటర్నెట్ సేవలను నిషేధిస్తున్న మోదీ ప్రభుత్వం, ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని పేర్కొంది.

  • Loading...

More Telugu News