: 16 పెళ్లిళ్లు చేసుకున్నానని నిరూపించిన వ్యక్తి అరెస్టు...షాదీ ముబారక్ వింత ఇది
నిరుపేద ముస్లింల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పధకం అపహాస్యం పాలైంది. షాదీ ముబారక్ పథకంలో అక్రమాలు జరిగినట్టు వార్తలు వెలువడడంతో ఏసీబీతో తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేయించింది. ఈ దర్యాప్తులో పాతబస్తీకి చెందిన జలాలుద్దీన్ అనే వ్యక్తి 16 పెళ్లిళ్లు చేసుకున్నట్టు పత్రాలు రూపొందించి పథకంలో లబ్దిదారుడుగా మారాడు. అతనికి రంగారెడ్డి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ తాహేర్ అండదండలతో షాదీ ముబారక్ స్కాం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. షాదీ ముబారక్ స్కీంలో భాగంగా తాహేర్ ఇప్పటికే 120 అప్లికేషన్లు ప్రాసెస్ చేశారు. ఈ అప్లికేషన్లన్ని భోగస్ వేనని అధికారులు నిర్ధారించారు. 16 పెళ్లిళ్లు చేసుకున్నానని ఆధారాలు చూపించిన జలాలుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.