: కాసేపట్లో ఆసుపత్రినుంచి డిశ్చార్జి కానున్న నటుడు దిలీప్ కుమార్
అస్వస్థతకు గురై ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో గత శుక్రవారం నుంచి చికిత్స పొందుతున్న ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ ఆరోగ్యం కుదుట పడింది. కాసేపట్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ కానున్నారు. దిలీప్‌కుమార్ కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. దిలీప్ న్యూమోనియాతో సతమతమవుతున్నారన్న వార్తలను ఖండిస్తూ.. 'జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరార'ని ఆయన సతీమణి సైరా బాను కొన్ని రోజుల ముందు వెల్లడించిన విషయం తెలిసిందే.