: హెచ్‌సీయూ వీసీని తొలగించాల్సిందే: వీహెచ్
రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావుని తొలగించాల్సిందేనని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వైస్‌ఛాన్సలర్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వీసీని తొలగించే అంశంలో యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ విషయమై ప్రధాని మోదీకి ఇప్పటికే పలు సార్లు లేఖ రాశానని అన్నారు. మోదీ స్పందించకపోతే రోడ్డెక్కి నిరసనను తెలియజేస్తామని తెలిపారు.