: సీఎం కేసీఆర్ ను కలిసిన నటుడు బాలకృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలుసుకున్న బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ముహూర్తపు సన్నివేశానికి హాజరు కావాలని కోరారు. కేసీఆర్ కు ఆహ్వానపత్రం అందజేశారు. ఈ నెల 22న గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం ముహూర్తపు సన్నివేశం జరగనుందని కేసీఆర్ కు చెప్పారు. కాగా, బాలకృష్ణ వెంట ఈ చిత్ర దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు.