: 58 మంది ఎంపీటీసీలు, 85 మంది సర్పంచ్ లు సహా 159 మంది వైకాపాకు రాజీనామా; టీడీపీలోకి జంప్!


విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఈ మధ్యాహ్నం విజయవాడలో జరిగిన ఓ సభలో వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయనల నేతృత్వంలో భారీ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. జిల్లాకు చెందిన 58 మంది సర్పంచ్ లు, 85 మంది సర్పంచ్ లు, ముగ్గురు జడ్ పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు కో-ఆపరేటివ్ సంఘాల అధ్యక్షులు సహా మొత్తం 159 మంది పచ్చ కండువా కప్పుకున్నారు. వీరంతా వైకాపాకు రాజీనామాలు పంపించారని ఈ సందర్భంగా సుజయకృష్ణ వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబు కడప, ఒంటిమిట్ట పర్యటనకు వెళ్లాల్సి వున్నందున, ప్రతి ఒక్కరినీ వేదికపైకి పిలవలేకపోతున్నామని, అందరూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయినట్టు భావించాలని కోరిన సుజయకృష్ణ, తాము కండువా కప్పుకుంటే, మీరంతా కప్పుకున్నట్టేనని అన్నారు.

  • Loading...

More Telugu News