: అనుభవం లేని డాక్టర్లతో ప్ర‌త్యూష‌కు అబార్షన్‌ చేయించారు: 'చిన్నారి పెళ్లి కూతురు' ప్రియుడి ఆగ్ర‌హం


'చిన్నారి పెళ్లికూతురు' సీరియ‌ల్‌లో 'ఆనంది'గా న‌టించి ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న‌ ప్రత్యూష బెన‌ర్జీ మృతి కేసులో ఎన్నో కొత్త విష‌యాలు వెలుగులోకొస్తున్నాయి. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి ముందే ఆమె అబార్షన్ చేయించుకుందని విచారణలో తేలిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌త్యూష ప్రియుడు రాహుల్‌ రాజ్ సింగ్ ఈ విష‌య‌మై స్పందిస్తూ.. అనుభవం లేని డాక్టర్లతో ప్ర‌త్యూష‌కు అబార్షన్‌ చేయించారని అన్నాడు. దాంతో ప్రత్యూష గర్భాశ‌యం దెబ్బతిందని చెప్పాడు. ప్ర‌త్యూష త‌ల్లిదండ్రుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. తనను అనవసరంగా ఈ కేసులోకి లాగార‌ని అన్నాడు. ప్ర‌త్యూష మృతిపై అస‌లు నిజం ఏంటో న్యాయస్థానంలో తేలుతుంద‌ని వ్యాఖ్యానించాడు. ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసుల‌కు ఇచ్చిన మొదటి స్టేట్‌మెంట్‌లో త‌నను అనుమానించ‌లేద‌ని, రెండోసారి ఇచ్చిన‌ స్టేట్‌మెంట్ లో త‌న‌పై నింద ఎందుకు మోపార‌ని ప్ర‌శ్నించాడు.

  • Loading...

More Telugu News