: తెలుగుదేశంలో చేరాం, ఎలా ఉండాలంటే..: సుజయకృష్ణ రంగారావు
"తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ. మనమంతా ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నాం. ఆ క్రమశిక్షణను ఎన్నడూ మీరకుండా ప్రజలకు సేవలందించాలి. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో శ్రమిస్తున్నారు. ఆయన కృషి, పట్టుదలకు మనమంతా సహకరించాలి" అని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయన ప్రసంగించారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని వైకాపా పేరును వెల్లడించకుండా విమర్శలు గుప్పించారు.