: జయకు గట్టిపోటీకి సిద్ధమవుతున్న విపక్షాలు...మాజీ మంత్రి అల్లుడిని రంగంలోకి దించిన బీజేపీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఎలాగైనా ఓడించాలని విపక్షాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. దీంతో ఆమెకు పోటీగా బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. జయలలిత పోటీ చేయనున్న ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలో నిలిపింది. అన్నాడీఎంకే మాజీ మంత్రి అరంగనాయగం అల్లుడు ఎంఎన్ రాజాను పోటీకి పెట్టింది. మూడు దఫాలుగా అభ్యర్థుల జాబితాలు విడుదల చేసిన బీజేపీ, తాజాగా విడుదల చేసిన జాబితాలో జయలలితకు పోటీగా ఎంఎన్ రాజాను పోటీకి నిలిపినట్టు పేర్కొంది.