: ఈక్వెడార్ లో మళ్లీ భూకంపం


ఈక్వెడార్ ను భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం వచ్చిన భూకంపం చేసిన గాయం నుంచి కోలుకోని ఈక్వెడార్ ను భూకంపం మరోసారి అతలాకుతలం చేసింది. తాజాగా వచ్చిన భూకంపం 6.1 తీవ్రతతో సంభవించింది. నాలుగు రోజుల క్రితం సంభవించిన భూకంప కేంద్రానికి సమీపంలోనే ఈ భూకంప కేంద్రం కూడా ఉంది. భూమికి పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చింది. 30 సెకెన్ల తేడాతో రెండు సార్లు భూమి కంపించడంతో ఇళ్లలోంచి ప్రజలు పరుగులు తీశారు. ఇటీవల సంభవించిన భూకంపం కారణంగా 413 మంది మరణించగా, 2,500 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. తాజా భూకంపం కారణంగా సంభవించిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News