: కడప వైకాపా ఎమ్మెల్యే అంజాద్ బాషాను ఎటూ కదలనివ్వని పోలీసులు!


కడప ఎమ్మెల్యే, వైకాపా నేత అంజాద్ బాషాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ సాయంత్రం కడపలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనుండగా, అంజాద్ నేతృత్వంలో వైకాపా వర్గీయులు అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే ఆయన్ను గృహం నుంచి ఎటూ కదలనివ్వకుండా చేసినట్టు సమాచారం. కాగా, కొత్త కలెక్టరేట్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ, వైకాపాతో పాటు దళిత సంఘాలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంపై అంజాద్ బాషా మాట్లాడుతూ, సీఎం పర్యటన గురించిన ఏ సమాచారమూ తనకు తెలియదని, అధికారులు కనీస ప్రొటోకాల్ ను కూడా పాటించలేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు తెలియకుండా సీఎం వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News