: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బొబ్బిలి వైఎస్సార్సీపీ యూనిట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో విజయవాడలో ఈ రోజు బొబ్బిలి వైఎస్సార్సీపీ యూనిట్ మొత్తం టీడీపీలో విలీనమైంది. బొబ్బిలి నియోజకవర్గంలో రాజులకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో వారికి విశేషమైన ఆదరణ ఉంది. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన ప్రతి నేత వారితో ముందుకు కదిలి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్యెల్యే సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ, తమను పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. పార్టీకోసం పాటుపడతామని సీఎంకు మాటిచ్చారు. పుట్టిన రోజున ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ పార్టీలో చేరే అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారికి పార్టీ కండువా కప్పి వారిని టీడీపీలోకి పార్టీ అధ్యక్షుడు ఆహ్వానించారు.