: ఏపీపై కేంద్రం వరాల జల్లు!... రాజమండ్రిలో అగ్రి వర్సిటీ, తిరుపతి ఐఐఎస్సీకి రూ.137 కోట్ల నిధులు
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం మరోమారు వరాల జల్లు కురిపించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇక తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)కి రూ.137 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాజమహేంద్రవరంలో సెంట్రల్ టొబాకో రీసెర్చి సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ముగిసిన కేబినెట్ భేటీలో కేంద్రం ఏపీకి తీపి కబురు వినిపించింది.