: రాజీవ్ గాంధీ హంతకుల విడుదలకు కేంద్రం ససేమిరా!... తమిళనాడు ప్రతిపాదనకు తిరస్కారం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తిరస్కరించింది. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన సభకు వచ్చిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు బెల్టు బాంబుతో పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు శిక్షలు ఖరారు కాగా... ప్రస్తుతం వేలూరు జైల్లో ఏడుగురు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విన్నవించింది. అయితే అందుకు ససేమిరా అంటున్న కేంద్రం తన పాత వైఖరికే కట్టుబడి... జయ సర్కారు ప్రతిపానదను తోసిపుచ్చింది.