: మైక్రోసాఫ్ట్ మరో సృష్టి... స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కవరే టచ్ స్క్రీన్!


టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో వినూత్న సృష్టితో వచ్చింది. స్మార్ట్ ఫోన్ కు రక్షణగా వినియోగించే ఫ్లిప్ కవర్ పై మునివేళ్లతో టచ్ చేస్తూ, ఫోన్ ను ఆపరేట్ చేసేలా సరికొత్త సెకండరీ ఈ-ఇంక్ డిస్ ప్లేను అభివృద్ధి చేసింది. ఈ-ఇంక్ డిస్ ప్లే సౌకర్యంతో పనిచేసే కొత్త స్మార్ట్ ఫోన్ కు 'యోటాఫోన్' అని పేరు పెట్టింది. ఆస్ట్రియాకు చెందిన రీసెర్చర్ల సహకారంతో ఈ ఫ్లెక్సీ కేస్ ను తయారు చేశామని, ఈ కవర్ ను ఎటువైపుకైనా మడత పెట్టవచ్చని తెలిపింది. కాగా, ఈ ఫ్లెక్సీ కేస్ స్మార్ట్ ఫోన్ కు ఉండే ఫ్లిప్ కవర్ లా పనిచేస్తుంది. దీనిపై మెసేజ్, మెనూ తదితర సింబల్స్ ఉంటాయి. వీటిపై తాకితే, మొబైల్ ప్రైమరీ స్క్రీన్ స్పందిస్తుంది. మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేసుకోవడం, పేజీల జూమ్, మ్యాప్ ల రొటేట్ వంటివెన్నో చేయవచ్చని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News