: విషపు కప్పలతో పార్సిల్.. చైనా అధికారుల షాక్
విషపు కప్పలతో వచ్చిన ఓ ప్రమాదకర పార్సిల్ చైనా అధికారుల తనిఖీల్లో బయటపడింది. ప్లాస్టిక్ కంటైనర్లలో ఉన్న వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్సిల్ పోలండ్ నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గిఫ్ట్ ప్యాక్‌లా ఆ పార్సిల్‌ను రూపొందించి చైనాకు తరలించారు. చైనా అధికారులకు లభించిన ఈ పార్సిల్లో వెరీ డేంజరస్ 'గోల్డెన్ డార్ట్ కప్ప' సహా మరో 10 విషపూరిత కప్పలు ఉన్నాయి. ఈ పార్సిల్‌పై మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు.