: విశాఖను హోం పిచ్ గా ఎంచుకున్న ధోనీ జట్టు... మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే!
మహారాష్ట్రలో తీవ్ర కరవు కారణంగా, అక్కడి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లను తప్పనిసరిగా మార్చాల్సిన తరుణంలో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియాన్ని హోం గ్రౌండ్ గా ఎంచుకుంది. లీగ్ లో భాగంగా పుణె ఆడే చివరి మూడు మ్యాచ్ లకూ విశాఖ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియంలో వచ్చే నెల 10న సన్ రైజర్స్ హైదరాబాద్ తో, 17న ఢిల్లీ డేర్ డెవిల్స్ తో, ఆపై 21న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లతో ధోనీ సేన తలపడనుంది.