: అరకు కాఫీకి చంద్రబాబు ఫిదా!... వేదికపైకే తెప్పించుకుని సిప్ చేసిన వైనం


విశాఖ మన్యంలో గిరిజనులు పండిస్తున్న కాఫీకి ‘అరకు కాఫీ’ పేరు పెట్టిన గిరిజన సహకార సంస్థ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాఫీని గతంలో సేవించిన ప్రధాని నరేంద్ర మోదీ... దాని రుచికి మైమరచిపోయారు. ఆ సందర్భంగా అరకు కాఫీ స్టాల్ వద్ద చాలా సేపే నిలబడి దాని ఉత్పత్తి, ప్రాముఖ్యతను అడిగి మరీ తెలుసుకున్నారు. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఫిదా అయ్యారు. నిన్న గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రులకు అరకు కాఫీ గురించి వివరించి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా అరకు కాఫీని వేదికపైకే తెప్పించి కేంద్ర మంత్రులతో పాటు ఆయన కూడా సిప్ చేశారు. చంద్రబాబు తెప్పించిన అరకు కాఫీ రుచి చూసిన కేంద్ర మంత్రులు కూడా బాగుందని సదరు కాఫీపై ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News