: భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ నిరీక్షక్ పై పేలుడు
కేరళలోని విళింజమ్ తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ నిరీక్షక్ పై పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గస్తీ నౌకలకు సహాయకారిగా విధులందించే ఈ నౌక తీరానికి వస్తుండగా, ఆక్సిజన్ సిలిండర్ పేలినట్టు తెలుస్తోంది. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో నౌక డ్రైవర్ కాలును కోల్పోగా, మరో ఇద్దరు నావికా దళ సిబ్బందికి గాయాలయ్యాయి. డ్రైవర్ కాలులో మోకాలి పైభాగం వరకూ తీసేయాల్సి వచ్చిందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు ఉన్నతాధికారులు వివరించారు.