: రాజకీయ పార్టీల్లో ధనిక పార్టీ బీజేపీనే!... లెక్కా పత్రం చూపని కాంగ్రెస్


జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ... అదే ఏడాది (2014-15) అన్ని జాతీయ పార్టీల్లోకెల్లా అత్యంత ధనిక పార్టీగా అవతరించింది. విజయం సిద్ధించిన ఏడాదిలోనే బీజేపీ ఆదాయం రూ.970.43 కోట్లుగా తేలింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన ఆడిట్ రిపోర్టు చెబుతోందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. ఎన్నికల్లో ఖర్చు, అందిన విరాళాలను తెలుపుతూ ఆడిట్ రిపోర్టులను అందజేయాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను బీజేపీ తుచ తప్పకుండా పాటించింది. నిర్దేశిత గడువు (నవంబర్ 30, 2015) లోగా బీజేపీ తన ఆడిట్ రిపోర్టును ఈసీకి అందజేసింది. ఇక బీజేపీతో పాటు నిర్దేశిత సమయంలోగా ఆడిట్ రిపోర్టులను అందజేసిన పార్టీలు మూడు మాత్రమేనట. వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లు మాత్రమే నిర్దేశిత గడువులోగా తన ఆడిట్ రిపోర్టులను ఆ పార్టీలు ఎన్నికల సంఘానికి అందజేశాయి. ఇక 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఇప్పటికీ తన ఆడిట్ రిపోర్టును ఈసీకి అందజేయలేదు.

  • Loading...

More Telugu News