: ఆలయాల్లోకి మహిళలు వెళ్లకూడదని ఎవరు చెప్పారు?: వెంకయ్య నాయుడు
దేశంలోని పలు ఆలయాల్లో మహిళలకు ప్రవేశం నిషేధం అనే అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ.. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లోకి మహిళలు వెళ్లకూడదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దేవుడ్ని పూజించేందుకు ప్రజలందరూ అర్హులేనని వ్యాఖ్యానించారు. దేశంలోని కుల వ్యవస్థపై కూడా స్పందిస్తూ.. కొందరు దాన్ని పెంచిపోషిస్తున్నారని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతోందని, ప్రజల్లో వాటిపై అవగాహన కల్పించాలని అన్నారు.