: ప్రత్యూష బెనర్జీ గర్భవతి అన్న విషయం రాహుల్ కు తెలుసట!
హిందీ హిట్ సీరియల్ ‘బాలికా వధు’ ఫేం బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతానికి సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ప్రత్యూష... ఆత్మహత్యకు ముందు అబార్షన్ చేయించుకుందని నిన్న ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సంచలన కథనాన్ని ప్రచురించింది. తాజాగా అదే పత్రిక మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. ప్రత్యూష బెనర్జీ గర్భవతి అన్న విషయం తనకు ముందే తెలుసని ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పోలీసులకు చెప్పాడట. గతంలో ఈ విషయం తనకు తెలియదని చెప్పిన రాహుల్... పోలీసులు కాస్తంత గట్టిగా అడిగేసరికి అతడు నిజం ఒప్పుకున్నట్లు నేటి తన సంచికలో ఆ పత్రిక ఓ కథనాన్ని రాసింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన ప్రత్యూష... అబార్షన్ చేయించుకున్న వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనతో రాహుల్ సంబంధం తెంచుకునేందుకు యత్నించే క్రమంలోనే ప్రత్యూష అబార్షన్ చేయించుకుందా? ఈ క్రమంలో ఆమె తనకు ఇష్టం లేకుండానే అబార్షన్ చేయించుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉందని రాహుల్ రాజ్ సింగ్ తరఫున వకాల్తా పుచ్చుకుని ఆనక విరమించుకున్న న్యాయవాది నీరజ్ గుప్తా చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.