: ‘అడెలె-హెలో’ వీడియో యూట్యూబ్ లో రారాజే!... 145 కోట్ల హిట్స్ దాటేసిన వైనం
అన్ని రకాల వీడియోలకు కేరాఫ్ అడ్రెస్ యూట్యూబ్. ఏ వీడియో కావాలన్నా ప్రస్తుతం మనమంతా నేరుగా యూట్యూబ్ నే సంప్రదిస్తాం. ఇంతటి ప్రాధాన్యమున్న యూట్యూబ్ లో ఓ వీడియో వంద కోట్ల మేర హిట్స్ సాధిస్తేనే రికార్డు. అలాంటిది ఏకంగా 145 కోట్ల 52 లక్షల 72 వేలకు పైగా హిట్స్ సాధిస్తే... రికార్డులకే రికార్డు. అందుకే ‘అడెలె-హెలో’ పేరిట యూట్యూబ్ లోకి వచ్చేసిన ఈ వీడియో నిజంగా రారాజే. గతేడాది అక్టోబర్ 22న యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియోను ఇప్పటికే 145 కోట్ల మందికి పైగా చూసేశారు. ఇక కామెంట్ల విషయానికొస్తే...7 లక్షల మంది ఈ వీడియోను చూసి తమ స్పందనను నమోదు చేశారు.