: పెళ్లిలో బాణసంచా పేలుడు... చిన్నారి మృతితో విషాదఛాయలు
వైభవంగా జరుగుతోన్న పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. సంతోషాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుని వేడుకల్లో బాణసంచా ఉపయోగించిన ఆ పెళ్లింట ఓ చిన్నారి మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. వివాహ ఊరేగింపు వేడుకలో భాగంగా ఉపయోగించిన బాణసంచాతో.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. బీహార్‌లోని అర్రా గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, మరి కొంతమంది గాయాలపాలయ్యారు. బాణసంచా పేలుడు పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.