: పాక్ పైశాచికత్వం... క్రిపాల్ సింగ్ అవయవాలు మాయం!


పాక్ పైశాచికత్వం మరోమారు బయటపడింది. పాక్ జైల్లో దశాబ్దాలుగా మగ్గుతూ గతవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన క్రిపాల్ సింగ్ మృతదేహంలోని గుండె, కాలేయం తదితర అవయవాలను పాక్ మాయం చేసింది. ముఖ్యమైన అవయవాలు లేని క్రిపాల్ మృతదేహాన్ని ఇండియాకు పంపింది. లాహోర్ లోని లఖ్ పత్ కారాగారంలో క్రిపాల్ మరణించిన సంగతి తెలిసిందే. "దేశం కోసం మా అంకుల్ ప్రాణాలను వదిలారు. సరబ్ జిత్ హత్య కేసులో ఆయనొక్కడే సాక్ష్యం. సరబ్ ఎలా మరణించాడో బయటకు తెలియకుండా చేసేందుకే పాక్ ప్రభుత్వం ఆయన్ను చంపించింది" అని క్రిపాల్ కోడలు అశ్వని ఆరోపించారు. మరోసారి పోస్టు మార్టం చేయాలంటే, శరీరంలోని ప్రధాన అవయవాల అవసరం ఉంటుందని, అందువల్లే అవయవాలు లేని శరీరాన్ని పాక్ పంపిందని వైద్యులు తెలిపారు. గతంలో సరబ్ జిత్ విషయంలోనూ పాక్ ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News