: 45 నిమిషాల పాటు ఆగిపోయిన ఆ గుండెను చెన్నై వైద్యులు మళ్లీ కొట్టుకునేలా చేశారు!


హృద్రోగ సమస్యతో ఆసుప‌త్రిలో చేరిన ఓ వ్య‌క్తి గుండె ఆగిపోయింది. దాదాపు 45 నిమిషాలు స్పందించ‌డం ఆగిపోయిన ఆ వ్య‌క్తి గుండెను కాంప్లికేటెడ్ వైద్య‌విధానంతో తిరిగి స్పందించేలా చేశారు. చెన్నైలోని ఫోర్టిస్‌ మలర్‌ వైద్యులు ఈ ఘ‌న‌త సాధించారు. గుజరాత్‌కు చెందిన 38ఏళ్ల‌ జైసుక్‌బాయ్‌ తాక్కర్ అనే వ్య‌క్తి గుండె సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధ‌ప‌డుతూ పోర్‌బందర్‌ నుంచి చెన్నైకి వ‌చ్చి స‌ద‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. జైసుక్‌బాయ్‌ తాక్కర్ గుండె ప‌రిస్థితిని పరీక్షించిన వైద్యులు గుండె మార్పిడి చేయాల‌ని చెప్పి, గుండె దాత కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. గుండె ప‌రిస్థితి మెరుగుప‌డేందుకు చికిత్స అందిస్తున్నారు. ఇంత‌లోపే ఒక్క‌సారిగా జైసుక్‌బాయ్‌ తాక్కర్ గుండె స్పందించ‌డం ఆగిపోయింది. దీంతో అత‌న్ని బ‌తికించేందుకు ఎక్‌స్ట్రాకార్పొరియల్‌ కార్డియోపల్మనరీ రెస్క్యుటేషన్ (ఈసీపీఆర్‌) వైద్య‌విధానంతో ప్ర‌య‌త్నం చేసిన వైద్యులు చివ‌రికి స్పందిచ‌డం ఆగిపోయిన ఆ గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. అనంతరం పదిరోజుల పాటు కోమా దశలోనే చికిత్సలు పొందిన జైసుక్‌బాయ్‌ తాక్కర్‌.. స్పృహలోకి రాగానే గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గుండె మార్పిడి చికిత్స‌ కూడా విజ‌య‌వంతం కావ‌డంతో ఈ సంద‌ర్భంగా ఫోర్టిస్‌ మలర్‌ వైద్యులు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఈ విష‌యాల్ని వెల్ల‌డించారు.

  • Loading...

More Telugu News