: లాతూరుకు చేరిన మరో నీటి రైలు... ప్రజలకు కాస్తంత ఊరట!
తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న మహారాష్ట్రలోని లాతూరుకు మరో నీటి రైలు చేరుకుంది. తొలి విడతలో 5లక్షల లీటర్లు నీళ్లు పంపించి, త్వరలో మరో 50 వ్యాగన్ల నీరు పంపుతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది. ఈరోజు ఉదయం 50 వ్యాగన్లలో 25 లక్షల లీటర్ల నీటితో నీటి రైలు రావడంతో ఆతృతగా వాటి కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో ఆనందం కనిపించింది. కొన్ని రోజుల క్రితం కేంద్ర రైల్వేశాఖ సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన వ్యాగన్ల ద్వారా దాదాపు 5లక్షల లీటర్ల నీటితో రైలు లాతూరు చేరుకున్న సంగతి తెలిసిందే. మరో వైపు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రైలు సౌకర్యం లేక ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు.