: చంద్రబాబుతో నారా లోకేశ్ కీలక భేటీ!... పార్టీలో చేరికలపై మంతనాలు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో... ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నిన్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో... పార్టీలోకి వెల్లువెత్తుతున్న చేరికలపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. తాజాగా నేడు బొబ్బిలి రాజవంశానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబినాయన టీడీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో నిన్నటి చంద్రబాబు, లోకేశ్ ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అప్పటికే ఉన్న టీడీపీ నేతలు, కొత్తగా చేరుతున్న వైసీపీ నేతల మధ్య సమన్వయంపై ఈ సందర్భంగా తండ్రీకొడుకులిద్దరూ చర్చించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News