: ఆపరేషన్ ఛబుత్ర!... ఆవారాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసుల వినూత్న చర్య


భాగ్యనగరి హైదరాబాదులో ఆవారాల ఆగడాలు నానాటికీ మితిమీరుతున్నాయి. ప్రత్యేకించి నడి రేయిలో రోడ్లపైకి వస్తున్న ఆకతాయిలు లెక్కకు మిక్కిలి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసులు ‘ఆపరేషన్ ఛబుత్ర’ పేరిట ప్రత్యేక ఆపరేషన్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పాతబస్తీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మాటు వేసిన పోలీసులు... రోడ్లపై వీర విహారం చేస్తున్న 192 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశారు. వీరిలో 24 మంది మైనర్ బాలురు కూడా ఉన్నారు. తొలుత వీరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు దక్షిణ మండలం డీసీపీ చెప్పారు. అప్పటికీ తమ పధ్ధతి మార్చుకోకపోతే... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News