: 2017లోగా అప్పులు చెల్లిస్తా!... అందుకోసమే ఆస్తులు అమ్ముతున్నా!: అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ


అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. వ్యాపారం నిమిత్తం బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులను చెల్లించేందుకు కార్యాచరణ ప్రారంభించానని ఆయన ప్రకటించారు. ఇందుకోసం తన ఆస్తులను కూడా అమ్మేస్తున్నానని ఆయన చేసిన నర్మగర్భ ప్రకటన భారత పారిశ్రామిక వర్గాల్లో పెద్ద చర్చకే తెర లేచింది. 17 బ్యాంకుల కన్సార్టియం నుంచి విజయ్ మాల్యా తీసుకున్న అప్పు వడ్డీతో కలుపుకుని రూ.9 వేల కోట్లపైకి చేరింది. ఈ అప్పును చెల్లించేందుకు ఇష్టపడని మాల్యా లండన్ పారిపోయారు. ఈ క్రమంలో అనిల్ అంబానీ చేసిన ప్రకటన బ్యాంకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చేదే. బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులను చెల్లించేందుకు ఇప్పటికే రూ.43,911 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించినట్లు అనిల్ అంబానీ ప్రకటించారు. 2017లోగా మొత్తం అప్పులన్నీ తీర్చేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. వ్యాపారం కోసం వందలు, వేలాది కోట్ల రూపాయల రుణాలను తీసుకున్న బడా పారిశ్రామికవేత్తలు కూడా అనిల్ అంబానీ బాట పట్టాలన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News