: కోదండరాముడి కల్యాణం నేడే!... పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు


కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నేడు రాములోరి కల్యాణం జరగనుంది. ఏపీ సర్కారు అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి రాత్రి 8 గంటలకు జరగనున్న ఈ కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. రాములోరికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకుని చంద్రబాబు అక్కడికి వెళ్లనున్నారు. అలాగే కడపలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. దానికి ముందు ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకాన్ని కూడా చంద్రబాబు ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News