: కొడుకు పుట్టిన ఆనందంలో క్రిస్ గేల్


వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ భార్య నతాషా బెర్రిడ్జ్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన ఉత్సాహంలో ఉన్న గేల్ ఆదివారం వెస్టిండీస్ కు బయలుదేరి వెళ్లాడు. బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన అనంతరం వెంటనే ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ఖతార్ ఎయిర్ వేస్ లో స్వదేశానికి వెళ్లినట్లు క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రేపు, ఆ తర్వాత జరిగే ఐపీఎల్ మ్యాచ్ లకు గేల్ అందుబాటులో ఉండడని సర్పరాజ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News