: నిషేధిత ‘హిజ్బుల్ ముజాహిద్దీన్’ ఉగ్రవాది అరెస్టు
నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్రవాది గులాం అహ్మద్ ను అరెస్టు చేశారు. బారాముల్లాలో అహ్మద్ ను అరెస్టు చేసినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అతని నుంచి రెండు గ్రెనేడ్లు, శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల నిమిత్తం యువతను రిక్రూట్ చేసుకునేందుకు అహ్మద్ ఇక్కడికి వచ్చినట్లు తమకు సమాచారం అందిందని భద్రతాబలగాలు పేర్కొన్నాయి. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.